Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ
- నిజాయితీ అధికారులకు సత్కారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిజాయితీ అధికారుల సంఖ్య పెరగాలి అని మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. పదేండ్లుగా సమాజం లో అవినీతి రహిత సమాజంగా పనిచేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసిన, పనిచేస్తున్న నిజాయితీ అధికారుల ఆత్మీయ సత్కారంను అదివారం బేగంపేటలోని హరితప్లాజాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి అధ్యక్షత వహిం చగా జేడీ లక్ష్మినారాయణ, మాజీ అడిషనర్ చీఫ్ సెక్రెటరీ అజరు మిశ్రా, మాజీ ఆర్టీఐ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ అవినీతి లేని మంచి సమాజం ఏర్పడాలంటే ప్రశ్నించడం తో పాటు, నీతిగా, నిజాయితీగా పని చేస్తున్న అధికారుల ను గుర్తించి వారికి అండగా ఉండాలన్నారు. ఇప్పుడు ఉన్న సమాజంలో నిజాయితీగా పని చేస్తున్న వారికి భద్రత లేకుండా పోయిందనీ, ఆ భద్రతను మనం ఇవ్వాలన్నారు. అందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందడుగు వేయాలనీ, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ చేస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశమంతా వ్యాపించాలన్నారు. నిజాయితీపరుల సంఖ్య పెరిగినప్పుడే మంచి సమాజం ఏర్పడుతోందనీ, మంచి సమాజం భావితరాలకు ఆదర్శ వంతంగా నిలుస్తోందన్నారు. గతంలో ఎంతోమంది ఉద్యో గం చేసినా, రాజకీయం చేసినా నూటికి నూరుపాళ్లు నిస్వా ర్థంగా పని చేశారనీ, ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల అంతా కలుషితమైపోయిందనీ, ఆ కలుషితమైన సమాజాన్ని మళ్లీ ప్రక్షాళన చేసే దిశ రాజేందర్ బృందం ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అజరు మిశ్రా మాట్లాడుతూ నిజాయితీ బతకాలన్నా, నిజా యితీగా పని చేయాలన్నా దానికి గుండె ధైర్యం కావాలన్నారు. అలాంటి వారిని వెతికి ఒకే వేదికపై సన్మా నించడం గొప్ప విషయం అన్నారు. వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చెడు చేసిన వారికి శిక్ష ఉండాలి అనీ, మంచి చేసిన వారికి గుర్తింపు ఉండాలన్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ నిజాయితీపరులు ఉన్నారో వెతకడం కూడా చాలా కష్టమైన పని అన్నారు. చాలా మంది తప్పులు చేస్తూనే, నిజాయితీగా ఉన్నట్టు నటిస్తారన్నారు. రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు, నాలుగు నెలల నుంచి నీతిగా, నిజాయితీగా పని చేసిన అధికారుల వివరా లను సేకరించామనీ, వారిని ఆత్మీయ సత్కారం పేరుతో సన్మానించాం అని తెలిపారు. అధికారులుగా పనిచేసిన వారు, ఇప్పటికీ పని చేస్తున్నవారిని మొత్తం 15మందిని ఎంపిక చేశామన్నారు. నిజాయితీ అధికారులు, నాయ కులు, సర్పంచుల కార్యక్రమం ప్రతి ఏడాదీ కొనసా గుతోందన్నారు.
15 మంది నిజాయితీ అధికారులకు సత్కారం
విద్యుత్ శాఖలో పని చేస్తున్న అశోక్, పాతబస్తీ ప్రాంత ంలో వైద్యశాఖలో వైద్యురాలిగా పని చేస్తున్న డా.అన్నపూర్ణ, సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న చిలకారాజు, ఆయుష్ వైద్యురాలిగా 35 ఏండ్లు పని చేసిన బండి విజయలక్ష్మి, నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ ఏఈగా పని చేసిన శ్రీనువాస్, పోలీస్ శాఖలో 15 ఏండ్ల క్రితం కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఈశ్వర్‌తోపాటు ఈపీఎఫ్ శాఖలో పని చేస్తున్న రాంబాబు, ఇంటిలిజెన్స్ శాఖలో పని చేస్తున్న చంద్రారెడ్డి, హెచ్‌జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పని చేసి, మెట్రోలో చేస్తున్న ఆనంద్ మోహన్, మార్క్ ఫెడ్లో పనిచేసి స్పోర్ట్ విభాగంలో పని చేస్తున్న విమలాకర్ రావు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్‌గా పని చేసిన జనార్థన్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న కాశీరాం, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజును ఎంపిక చేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దన్నపునేని అశోక్ కుమార్, కానుగంటి రాజు, కొమటి రమేష్ బాబు, కొన్నె దేవేందర్, హరిప్రకాశ్, గంగాధర్, అంజుకర్, రాజేశ్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.