Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పట్టు సాధించాలి అని హైదరాబాద్ డీఈఓ రోహిణి అన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన సౌత్ ఇండియన్ సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఎస్ఐఎస్డీఎఫ్-2022 పోటీలలో బండ్లగూడ మండ లం జ్ఞాన భారతి మోడల్ హైస్కూల్ చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు శని వారం డీఈవో ఆర్.రోహిణి ఓ ప్రకటన విడుదల చేశారు. భారతదేశ అభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధార పడి ఉందనీ, ఆ రంగాల్లో విద్యార్థులు పట్టు సాధించాలని ఆకాక్షించారు. డీఈవో ఆదేశాల మేరకు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలను డీఎస్వో పి.ధర్మేందర్ రావు ఆధ్వర్యంలో కేశవ మెమోరియల్ హైస్కూల్ హిమాయత్ నగర్ మండలంలో నిర్వహించగా, ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్, యాడ్ టెక్నో కమర్షియల్ ఆర్అండ్డీ సర్వీసెస్ డాక్టర్ జి.ఆదిలక్ష్మి వ్యవహరించారు. ఇక జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం జ్ఞాన భారతి మోడల్ హైస్కూల్ బండ్లగూడ మండలం, ద్వితీయ స్థానంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొల్లారం, తృతీయ స్థానంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల యూసుప్గూడ నిలిచారు. ప్రథమ స్థానంలో నిలిచిన జ్ఞానభారతి మోడల్ హైస్కూల్ విద్యార్థులు మాత్రమే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన జ్ఞాన భారతి విద్యార్థులు గైడ్ టీచర్ శ్రీలతను బంగారు పతకం బహూకరించి, ప్రిన్సిపాల్ వి.ప్రభాకర్ రావును డీఈవో ప్రత్యేకంగా అభినందించారు. వీరితో పాటు పాఠశాల సీనియర్ టీచర్ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.