Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓఎస్డ్డీగా యదావిధిగా కొనసాగించాలి
- ఓయూ గిరిజన విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ-ఓయూ
జేఎన్టీయూ ఓఎస్డీ డా.ధర్మనాయక్ను విధుల్లోకి తీసుకోవాలని గిరిజన విద్యార్థులు డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్, గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుబ్బు నాయక్, ఏఐబిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హలావత్ మోహన్ నాయక్, బంజారా భేరి విద్యార్థి సంఘం చెర్మెన్ బాలు నాయక్‌లు సమావేశం మాట్లాడుతూ జేఎన్టీయూ, హైదరాబాద్ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డా.ధర్మా నాయక్‌ను కులవివక్ష చూపిస్తూ కుట్రపూరితంగా తొలగించడం హేయమైన చర్య అని గిరిజన విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. గిరిజన లంబాడి సామాజిక వర్గానికి చెందిన మేధావి అత్యధికంగా మూడు డాక్టరేట్లు కలిగిన విద్యావేత్త అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, జేఎన్టీయూ ఓఎస్డ్డీి ధర్మానాయక్ డిప్యూటేషన్ ఉపసంహరించుకోవాలని, ఒక గిరిజన మేధావిని అన్యాయా నికి గురిచేయడం చాలా అవమానకరమని గిరిజన విద్యార్థి సంఘాలుగా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల గిరిజన మేధావి వర్గాన్ని ఉద్యోగులను అవమానపరించడమే కాకుండా పదవులు ఇచ్చి మధ్యలోనే నిరాధారమైన ఆరోపణల ద్వారా సర్వీసులకు ఇబ్బంది కలిగించి మానసికంగా ఇబ్బంది పడే విధంగా చేస్తున్న చర్యల వల్ల వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల కోసం గిరిజన రిజర్వేషన్, గిరిజన బంధు లాంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టి గిరిజనులను అభివద్ధి పథంలోకి తీసుకెళుతుంటే కొందరు అధికారులు కుల వివక్ష చూపిస్తూ గిరిజన మేధావి అయిన డా. ధర్మానాయక్‌ను తన పదవి నుండి తప్పించడం దుర్మార్గమన్నారు. గిరిజన జాతికి చెందిన వ్యక్తి కావడం వల్లనే ఈ విధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని జయించి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి మూడు పీహెచ్డీ అవార్డులు పొంది, ఎన్నో వేల మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు మార్గదర్శకులు అయిన ఒక గొప్ప వ్యక్తిత్వం గల ప్రొఫెసర్ ధర్మానాయక్ గిరిజన జాతి చరిత్రలో మొదటిసారిగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొంది, ఉన్నత ఆశయాల కోసం పరితపించే వ్యక్తిని ఈ విధంగా అవమానించడం, బాధ్యతల నుండి తొలగించడం గిరిజన విద్యార్థులకు, ప్రజా సంఘ నేతలకు, గిరిజన ప్రజలకు ఆవేదన కలిగిస్తుందన్నారు.
వీసీ చేసిన తప్పును సరిదిద్దుకొని విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల విద్యార్థి నాయకులు విజరు నాయక్, గిరిజనశక్తి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.రాజారాం నాయక్, లింగానాయక్, ప్రణరు రాణా, మహేష్, హనుమంతు నాయక్, కిరణ్‌కుమార్, రమేష్ నాయక్, అరుణ్, రాజేందర్ పాల్గొన్నారు.