Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల ద్వారక నగర్ కాలనీ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కాలనీలో పర్యటించారు. కాలనీలో మౌలిక సదుపాయాలతో పాటు కమ్యూనిటీ హాల్, రోడ్డు విస్తరణ మరియు పార్క్‌లను ఏర్పాటు చేయాలని వారు కోరారు. సమస్యల పట్ల సాను కూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొంది స్తామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్, టీ.ఆర్.ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆందోజ్ సత్యంచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మే రెడ్డి ఉదరు కుమార్ రెడ్డి, గజ్జెల మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు కంచర్ల శివారెడ్డి, డేరంగుల కృష్ణ కాలనీ అధ్యక్షుడు ఆర్.బాల్ రెడ్డి, కొల్లు నర్సింహ్మారెడ్డి, జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి తదితులున్నారు.