Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
సరూర్‌నగర్ సర్కిల్ సీఐటీయూ కన్వీనరగా మల్లెపాక వీరయ్య ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. సరూర్‌నగర్ సర్కిల్ సీఐటీయూ కమిటీ సర్కిల్ పరిధిలో ఉన్న రంగాల ఆధ్వర్యం లో సరూర్‌నగర్ సర్కిల్ సీఐటీయూ మూడో మహాసభ ఆదివారం జరిగింది. రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు కీసర నర్సిరెడ్డి ఆధ్వర్యంలో 15మందితో కూడిన సర్కిల్ కమిటీ ఏర్పడింది. వీరయ్య మాట్లాడుతూ సరూర్‌నగర్ సర్కిల్ ప్రాంతంలో భవన, నిర్మాణ కార్మిక లేబర్ అడ్డాలలో ఎలాంటి సౌకర్యాలు లేవు. అని సౌకర్యాలు కల్పించాలని గతంలో కమిషనర్‌కి అడ్డాల మీద ఉన్న సమస్యలను తెలియజేయడం జరిగింది అని తెలిపారు. అడ్డాల మీద మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు షెడ్లను నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని రంగాల కార్మికులను కలుపుకొని పోరాటాలకు సిద్ధం చేస్తామ న్నారు. వివిధ పోరాటాలు ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అన్నారు. 29 కార్మిక చట్టాలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్స్‌గా తీసుకొచ్చిందన్నారు. కేంద్ర బీజేపీి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరిం చుకోవాలన్నారు.
ఈ కమిటీకి ఎన్నికైనవారు జి.చైతన్య, కె.రాములు, సి.నవీన్, టి.బాలస్వామి, ఎండి లతీఫ్, బట్టు పరశురాములు, వి.వెంకన్న, వి.ఎల్లయ్య, ఎం.పోచయ్య, ఎండి రఫీ, ధనరాజ్, మేకల కృష్ణ, భీమనాయక్, మహిళా నాయకురాలు బుచ్చమ్మలను ఎన్నుకున్నారు.