Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
నవతెలంగాణ-హస్తినాపురం
బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గల శ్రీ గాయత్రి నగర్ కాలనీ నుండి పాపిరెడ్డి కాలనీ మీదుగా జరుగుతున్న స్ట్రాం వాటర్ పైప్ లైన్ పనులను స్ధానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యమైన మెటీరి యల్ను వాడి కాలనీ ప్రజలకు త్వరితగతిన అందుబా టులో వుండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారు లకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. కాలనీలో నెలకొన్న ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కాలనీవాసులకు లచ్చిరెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ముడుపు సందీప్ రెడ్డి ఉపాధ్యక్షులు, విష్ణువర్ధన్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు పాండురంగారెడ్డి, రాజు గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.