Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రాభివృద్ధి
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్రంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని ఆమె అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ అల్మాస్గూడ రాజీవ్ గృహకల్పలో మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డితో కలసి సీసీ రోడ్డు నిర్మాణ పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం బడంగ్పేట్, నాదర్గుల్లోని వివిధ డివిజన్లలోని శ్రీకృష్ణానగర్, మాతృశ్రీనగర్, వైకుంఠపురం కాలనీ, ప్లాంటేనం సిటీ 1, ప్లాటినం సిటీ 2, వెంకటాద్రి నివాస్ ఫేస్ 3, రఘుహోమ్స్, శ్రీరామ్ నగర్, లక్ష్మీనగర్ కాలనీలలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీి తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీి నల్లాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ఇప్పటికే వంద శాతం పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. రింగ్‌రోడ్ లోపల శివారు ప్రాంతాల్లో ఉన్న మునిసిపాలిటీలలో నూతన పైప్లైన్లు, రిజర్వాయర్లు, తదితర వాటికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1200కోట్ల్లు నిధులు మంజూరు చేశారని, అందులో మహేశ్వరం నియోజకవర్గానికి 210కోట్లు వచ్చాయని, బడంగ్పేట్ కార్పొరేషన్‌కు రూ.60కోట్ల నిధులు విడుదల కాగా, పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఒక్కరోజే 8 కాలనీలలో రూ.4కోట్ల 69 లక్షలతో చేపట్టిన వాటర్ వర్క్స్ పనులు పూర్తిచేసుకొని ఇంటింటికీి తాగునీరు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. వాటర్ బోర్డు అధికారులు ఇంతే వేగంగా మిగిలిన అన్ని కాలనీలకు నీరు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి మహిళలు జరుపుకోనున్న బతుకమ్మ పండుగ
శుభాకాంక్షలు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, డీఈఈలు అశోక్‌రెడ్డి, జ్యోతి, కార్పొరేటర్లు ముత్యాల లలితకృష్ణ, బిమిడి స్వప్న జంగారెడ్డి, సుర్ణగంటి అర్జున్, వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, తోట శ్రీధర్‌రెడ్డి, జి.ఇంద్రసేన,రాళ్ళగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, నిమ్మల సునిత శ్రీకాంత్‌గౌడ్, బండారు మనోహర్, నాయకులు పెద్దబావి ఆనంద్‌రెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, జగన్మోహన్రెడ్డి, నాదర్గుల్ రైతు సహకార బ్యాంకు చైర్మెన్ మర్రి నర్సింహారెడ్డి,వివిధ శాఖల అధికారులు, వివిధ కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ముంపు బాధితులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి
మీర్పేట్లో..
జిల్లెలగూడ గీతాంజలి లయన్స్ క్లబ్ సేవలు భేష్ అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గీతాంజలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు నిత్యావ సర సరుకులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లెలగూడ గీతాంజలి లయన్స్ క్లబ్ సామాజిక స్పృహతో పేదలకు సహాయం అందించే దిశగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు, నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం, రక్తదాన శిబిరాలు లాంటి అనేక కార్యక్రమాలు చేయడాన్ని అభినందించారు. నా నియోజకవర్గ స్థాయిలో రెండు చోట్ల బ్లడ్ బ్యాంక్, ఆసుపత్రి ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, ఇక్కడ ఏర్పాటు చేసినందుకు జిల్లెలగూడ లయన్స్‌క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుండి కూడ లయన్స్‌క్లబ్‌కు ఎల్లప్పుడు సహాయసహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, లయన్ కౌన్సిల్ చైర్మెన్ విద్యాసాగర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ గవర్నర్ రఘు, నారాయణ బట్టడ్, వెంకటేశ్వరరావు, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు ఏనుగుల అనిల్‌కుమార్ యాదవ్, బొక్క రాజేందర్‌రెడ్డి, సిద్దాల బీరప్ప, టీిఆర్‌ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.