Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లోని ఆనంద్ నగర్ కాలనీ సంక్షేమ కమిటీ భవనంలో ఆదివారం కాలనీ సంక్షేమ కమిటీ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్‌లు పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరానికి స్థానిక కాలనీ వారు, పరిసరాల వారు వచ్చి తమ కంటి జబ్బులకు పరీక్షలు చేయించుకొని తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు జోషి కార్యదర్శి సత్య శ్రీనివాస్ కోశాధికారి ద్వారకరాము, ఆప్తమాలజిస్ట్ డాక్టర్ శివాజీ, కాలనీవాసులు రాఘవాచారి, రాజు తదితరులు పాల్గొన్నారు.