Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/కాప్రా/అబ్దుల్లాపూర్‌మెట్/
భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తికోసం దొరలు, దేశ్‌ముఖ్‌లు, రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ అని పలువురు వక్తలు కొనియాడారు. ఐలమ్మ 127వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. సోమవారం నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, కాలనీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాటి పోరాట ఘట్టాలను, ఐలమ్మ చరిత్రను స్మరించుకున్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జలమండలి కార్యాలయంలో...
ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో చిట్యాల ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. జలమండలి ఎండీ దానకిశోర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయం చేస్తున్నది ఎంతటి బలవంతులైనా వారికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడాలనే గొప్ప స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ అందించారని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, వినోద్, ప్రభు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్లో...
చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ కాలనీలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మల్లపూర్ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పన్నాల దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐలమ్మ జయంతి వేడుకల కమిటీ వైస్ చైర్మెన్ నెమలి అనిల్ ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగరం బాబు, పీిఆర్ నాగరాజు, ఎస్వి శ్రీనివాస్, రఘు, నాగరం చంద్రశేఖర్, రామంజి, శ్రీనివాస్, రాము, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చిట్యాల ఐలమ్మ
తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, చిట్యాల ఐలమ్మ, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తా, కుషాయిగూడ దోబిఘాట్లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో ఆమె సేవలను స్మరించుకోవడం అదష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నాగిళ్ల బాల్ రెడ్డి , పండాల శివకుమార్ గౌడ్ కనకరాజు గౌడ్, నా రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బత్తుల శ్రీకాంత్ యాదవ్, బొడిగె ప్రభుగౌడ్, జై కృష్ణ సంపత్ పాల్గొన్నారు
జవహర్‌నగర్‌లో ..
జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బీజేఆర్ నగర్లో స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ విగ్రహానికి బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, జవహర్ నగర్ ఎస్సై పల్సనాగరాజు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు మాట్లా డుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళ చాకలి ఐలమ్మలాగా పోరాడే తెగువ అలవర్చుకోవాలన్నారు. తెలంగాణ వచ్చాకే మహానీయుల చరిత్ర వెలికివస్తోందన్నారు. చిట్యాల ఐలమ్మ జీవిత చరిత్ర గొప్ప స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ వర్మ, బీసీ విద్యార్థి సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఇంద్రమ్ రజక, రామరజక సంఘం అధ్యక్షులు వడ్లకొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కొన్నే వెంకటేష్, ఆశిష్, వాసు, బలరామ్ తదితరులు పాల్గొన్నారు.
మీర్పేట్ చౌరస్తాలో...
మీర్పేట్ చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మీర్పేట్ రజక సంఘం నాయకులు, ప్రజాసంఘాల నాయకులు.
అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో..
తెలంగాణ వీరనారి, రైతాంగ సాయుధ పోరాట యుద్ధనారి చిట్యాల పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం అని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పరిధిలోని జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజాకారులు, దేశముఖ్‌లు, దేశ్ పాండేలు, పటేల్ పట్వారీల అరాచకాలపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన వీరవనిత చిట్యాల ఐలమ్మ అని వివరించారు. నాడు కమ్యూనిస్టు నాయకులు మఖ్దూమ్ మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి వంటి నాయకులతో కలిసి వీరోచిత పోరాటం చేసిన యోధురాలు ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు కేతరాజు నరసింహ, నాయకులు నాగవల్లి యాదగిరి, బిక్షపతి, నాగేశ్వరరావు, చందన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్లో...
చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివని పోచారం మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. పోచారం మున్సిపల్ పరిధిలోని యంనంపేట్ కౌన్సిలర్ నర్రి ధనలక్ష్మి కాశయ్య ఆధ్వర్యం లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. వాయిస్ చైర్మెన్ రెడ్యా నాయక్, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందాడి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగొల్ల బాలేష్, ప్రధాన కార్యదర్శి శేఖర్, కౌన్సిలర్స్ సాయిరెడ్డి, సుర్వి రవి, నాయకులు బుచ్చిరెడ్డి రవి, పద్మారావుశేఖర్, వెంకటేష్, రజక సంఘం సభ్యులు అంజయ్య యాదగిరి, రవి, ప్రేమ్‌కుమార్, శేఖర్, మహేష్, రమేష్, గణేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.