Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం చేపడుతున్న అభివద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ మహిళామోర్చా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఆకుల సరితా పటేల్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సోమవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా ఉపాధ్యక్షురాలు రమ్యశ్రీ ఆధ్వర్యంలో సుమారు 50 మంది మహిళా మోర్చా నాయకురాళ్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు సరైన గౌరవం టీిఆర్ఎస్తోనే సాధ్యమని, ఒక మహిళగా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న సబితారెడ్డిపై స్వంత పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నచ్చక, మహిళ ప్రాధాన్యం లేకపోవడంతో బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనే నియోజకవర్గ అభివద్ధి సాధ్యమని, అన్ని రంగాల, వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల సరితాపటేల్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా ఉపాధ్యక్షురాలు రమ్యశ్రీ, సంగీత, వసుంధర, రమాదేవి, మౌనిక, జ్యోతి, సరిత, పల్లవి, రవళితో పాటు 50 మంది మహిళలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, సీనియర్ నాయకులు పెద్దబావి ఆనంద్‌రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మహిళా నాయకురాలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.