Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనిషికి పుస్తక పఠనంతోనే విజ్ఞానం
- చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రతి మనిషికీ పుస్తక పఠనంతోనే విజ్ఞానం అభివృద్ధి చెందు తుందని రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని గ్రంథాలయానికి కందుకూరు మండలం ఎంపీటీసీి ఫోరం మాజీ అధ్యక్షులు మూల హన్మంత్ రెడ్డి అమెరికా నుండి తిరిగి వచ్చి అంతర్జాతీయ పుస్తకాలను చైర్మెన్ పాండురంగారెడ్డి ద్వార గ్రంథాలయానికి వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని మాధ్యమాలు వచ్చినా, ఎంతవృద్ధి జరిగినా మనిషికి పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానమే ఉన్నతమైనదన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కప్పాటి పాండు రంగారెడ్డి మాట్లాడుతూ పుస్తకం... మూడు అక్షరాలే ఉన్నా.. మానవ మెదడుకి సరికొత్త ఆవిష్కరణలను నేర్పుతుందని, కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుందని, మనిషికి ఊహాశక్తిని కల్పిస్తుందన్నారు. పాత సమాజపు లోపాలను కనిపెట్టి.. ముందు తరాలకు ప్రగతిపథాన్ని నిర్మిస్తుందని, సమాజ పురోగతికి తోడ్పడుతుందని తెలిపారు. తరతరా లకు విజ్ఞానాన్ని అందిస్తు సమాజ పురోగతికి దోహద పడుతుందన్నారు. మానవ సంబంధాలు మెరుగుపడేం దుకు సహాయం చేస్తుందని, పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం, అనుభూతి అది అనుభవించే వారికే తెలుస్తుందని పేర్కొన్నారు. పుస్తకాన్ని చదవడం కనుక ఆస్వాదించగలిగితే... దాన్ని మించిన తృప్తిని మరింకేదీ ఇవ్వదంటే అతిశయోక్తి కాదన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని అధిగమించేలా చేస్తుందన్నారు. పుస్తకం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని, పుస్తకాలు వితరణ చేసిన మూల హన్మంత్రెడ్డిని సంస్థ తరపున చైర్మెన్ కప్పాటి పాండు రంగారెడ్డి శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహు కరించారు. ఈ కార్యక్రమంలో లేమూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సిబ్బంది సత్యనారాయణ, ప్రతాప్, జైహింద్, ప్రసన్న, మమత తదితరులు పాల్గొన్నారు.