Authorization
Thu March 13, 2025 03:35:03 am
- నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు దశలవారీగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. సోమవారం నాగారం పురపాలక సంఘం 17వ వార్డ్‌లోని న్యూ హనుమాన్ నగర్ కాలనీలో రూ.6.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీలో కాలనీలపరంగా విస్తరించి ఉండటంతో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బండారి మల్లేశ్ యాదవ్, కమిషనర్ వాణి రెడ్డి, కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, నాయకులు గూడూరు ఆంజనేయులు గౌడ్, డీఈఈ సుదర్శనం, రఘు, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.