Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
బాగ్ అంబర్‌పేట డివిజన్లోని బస్తీలు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలను వెంటనే తొలగించాలని కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. సోమవారం డివిజన్ పరిధిలోని సీఈ కాలనీ పార్క్‌లో డీఎంసీ వేణుగోపాల్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని బస్తీలు, కాలనీలలో చెత్త, మట్టి కుప్పలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వెలగని విద్యుత్ దీపాలను గుర్తించి వెంటనే పునరుద్ధరించాలన్నారు. విద్యుత్ సమస్యలు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రయినేజీ, లో ప్రెషర్ నీటి సరఫరా, కలుషిత మంచినీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్ల సమస్యలు, ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అవసరం ఉన్నచోట స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ వెంకట్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి జెమ్మిచెట్టు బాలరాజ్, కాలనీ కార్యదర్శి వెంకటరావుగారు, ఏఎంహెచ్‌వో జ్యోతిబారు, విద్యుత్ శాఖ ఏడీఈ శీనయ్య, జీహెచ్ఎంసీ అధికారులు సుధాకర్, ఫరీద్, జలమండలి మేనేజర్ మాజీద్, ఏఈ సౌమ్య పాల్గొన్నారు.