Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను నగరవ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు ఆమె చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కొనసాగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం, తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాయని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
నవతెలంగాణ- సికింద్రాబాద్/ఓయూ/మల్కాజిగిరి/దుండిగల్/అంబర్‌పేట
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చిట్యాల ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. సోమవారం తార్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని తెలిపారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ జయంతిని ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తి నేటి తరం మహిళలకు, యువతకు, ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు రామాటేంకి శ్రీను, సాయి కిరణ్, రాజు, నాయకులు సాంబశివరావు, లెనిన్, శ్రీను, వెంకట్, సందీప్, మంజునాధ్, గోపాల్, పవన్, జైసింగ్, సుధాకర్, మహేష్ పాల్గొన్నారు.
రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బడుగుల ఆత్మగౌరవానికి ప్రతీక ఐలమ్మ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అంబర్‌పేటలోని బీసీ భవన్లో తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ జయంతిని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్కుర్మ, విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, సింగం నగేష్, పాలకూరి కిరణ్, చింతకింది స్వామికుమార్గౌడ్, వరికుప్పల మధు, గొడుగు మహేష్‌యాదవ్, మదగోని కృష్ణ, బోదాసు శ్రీధర్, శ్రీధర్, నర్సింగ్, సతీష్, చింతకింది సాయితేజ, పాలకూరి మురళి, బండిగారి భరత్, గోరేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుట్ట రజక సంఘం ఆధ్వర్యంలో రజక ఐలమ్మ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సెక్రటరీ పైళ్ల ఆశయ్య, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్వీ అధ్యక్షుడు జి నరేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకార్ల అరాచకాలను ఎదిరించిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు. అనంతరం 200 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అంతే చక్రపాణి, ఆర్ఐ రాధిక, వివిధ పార్టీల నాయకులు బాబు, ఆర్ మల్లేష్, ఆనంద్, రజక సంఘం అధ్యక్షులు పి నరసింహ, ఉపాధ్యక్షులు ఎన్ గోపాల్, సెక్రెటరీ కే స్వామి, సభ్యులు ఎం. మల్లయ్య, పి. బాలమల్లు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు భద్రగమ ఆంజనేయులుతో కలిసి ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రజక సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శనిగరం అశోక్, రాష్ట్ర అధ్యక్షులు ముంజంపల్లి రాములు, ఉపాధ్యక్షులు జూపల్లి కర్ణాకర్, ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుసోమయ్య, కార్యదర్శి సకినాల రవి, కోశాధికారి జెంజిరాల సత్యనారాయణ, రజక ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బర్లపాటి జయరామ్, వెంకటేష్, కొమురయ్య, పగిల్ల సాయి, నిమ్మల వంశీ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో వీరనారి ఐలమ్మ జయంతిని ఈసీఐఎల్ చౌరస్తా వద్ద సోమవారం ఘనంగార నిర్వహించారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు, ప్రజా సంఘాల నాయకులు వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు చైతన్య కలిగించిన గొప్ప యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. నేడు పాలకులు మతాల చిచ్చుపెట్టి దానిని తెలంగాణ సాయుధ పోరాటానికి అంటగట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో స్ఫూర్తి గ్రూప్ సభ్యులు సమాచార హక్కు చట్టం సాధన యోధులు గగన్ కుమార్, సామాజిక కార్యకర్త ప్రసాద్ బాబు, శ్రీనివాసరావు, బంగారు నర్సింగరావు, బసవపున్నయ్య, కాప్రా కార్పెంటర్ అసోసియేషన్ నాయకులు నరసింహ చారి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈసీఐఎల్ క్రాస్ రోడ్ వద్ద వీరనారి ఐలమ్మ విగ్రహానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
వీరత్వానికి ప్రతీక చిట్యాల ఐలమ్మ అని కార్పొరేటర్ రాజ్యాలక్మి అన్నారు. సోమవారం కృప కాంప్లెక్స్ ఆవరణలో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొని ఐలమ్మకు ఘనంగా నివాళి అర్పించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్‌లోని సుందరయ్య భవన్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బ్యాగారి వెంకటేష్, ఆర్.సంతోష్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బాలపీరు ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు రాజేష్, అజయ్, అచ్యుత్, రమ్య, సుష్మ, కార్తిక్, భగత్ తదితరులు పాల్గొన్నారు.