Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్
- ప్రజావాణిలో 65 వినతుల స్వీకరణ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ అన్నారు. సోమవారం శామీర్‌పేట్‌లోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి 65 వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈసందర్భంగా రాంపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లు 237, 238 ఎర్రమల్లె వాగు వెంట ఆనుకుని ఉన్న బఫర్ జోన్ స్థలాన్ని కాపాడాలని స్థానికులు అధికారులకు ఫిర్యాదుచేశారు. సర్వే నెంబర్లు 237, 238, 239, 240, 241లలో ప్లాట్లు నిర్మాణం చేసి కొందరూ కబ్జా చేస్తున్నారని చెప్పారు. దీనిపై స్థానిక నాయకులకు, మండల రెవెన్యూ అధికారులకు, సమాచారం ఇచ్చామని అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేరుకోలేదని రాంపల్లి వాసులు చెప్పారు. దీనిపై అదనపు కలెక్టర్లు స్పందిస్తూ సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.