Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ-కాప్రా
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని చాణక్యపురి కాలనీ గుల్మొహర్ గార్డెన్స్ జి. బ్లాక్ రోడ్డులో జరుగనున్న భూ గర్భ డ్రయినేజీ బాక్స్ డ్రైన్ పనుల స్థలాన్ని మల్లాపూర్ కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ పన్నాల దేవేందర్ రెడ్డి పరిశీలించారు. రోడ్డులో ఉన్న మంచినీటి పైప్‌లైన్, లెవెలింగ్ పనుల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ హరిలాల్, డీఈ రూపా, ఏఈ శ్రవంతి, స్థానికులు దుర్గాప్రసాద్, పీఆర్, ప్రవీణ్, ఫాతిమారెడ్డి, సంతోష్, కిరణ్, చంద్రారెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.