Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోట గడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డమీద బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టులు నాగేంద్ర చారి, దయాకర్ రెడ్డిలతో కలిసి మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుండిగల్‌లో జర్నలిస్టుల కోసం చదును చేసిన స్థలం విషయాలపై చర్చించారు. అక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు ఇండ్లు కట్టుకునేలా స్థలం కేటాయించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని స్పష్టమైన హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ ప్రెస్ కార్యదర్శులు సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ అనిల్, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, జర్నలిస్ట్ కాలనీ కార్యనిర్వాహక అధ్యక్షులు ముచ్చర్ల లాలయ్య తదితరులు పాల్గొన్నారు.