Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకార సంఘం చైర్మెన్ పెంటారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సహకార బ్యాంకులు రైతులు, ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిస్తున్నాయని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు చైర్మెన్ సింగిరెడ్డి పెంటారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డిజిల్లా, మహేశ్వరం నియోజకవర్గం ప్రాథమి వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు, బండ్లగూడ కల్సా, బాలాపూర్లో ఉన్న సహకార బ్యాంకు 46వ వార్షిక సర్వసభ్య సమావేశం చైర్మెన్ పెంటారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ... సహకార బ్యాంకులో రైతులు, పొదుపు సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు డబ్బులు పొదుపు చేసుకోవాలని, వారి డబ్బులకు పూర్తి భద్రత ఉంటుందని తెలిపారు. చిరు వ్యాపారులకు రుణాలు కూడా అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో రుణాలను అందచేసి ప్రజల ఆర్థికాభివద్ధికోసం తోడ్పాటునందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైఎస్ చైర్మెన్ కొలన్ తిరుపతిరెడ్డి, స్థానిక కార్పొరేటర్లువంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర జైహింద్ మహేశ్వరి, బ్యాంక్ సభ్యులు, బ్యాంక్ బ్యాంకు ఖాతా దారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బ్యాంకులో అధిక మొత్తంలో డబ్బులు పొదుపు చేసిన వారికి, మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు.