Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వాన
- లోతట్టు ప్రాంతాలు జలమయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపు లతో కూడిన భారీ వర్షం కురిసింది. సోమ, మంగళ వారాల్లో భారీ వర్షం కురువడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. సోమ వారం తరహాలోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. కిలోమీటర్ దూరం దాటాలంటే 2గంటలకుపైగానే సమ యం పట్టింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్పం దించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, అత్య వసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించింది. డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసింది. అబిడ్స్, సుల్తాన్ బజార్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట, చిలకలగూడ, ఆల్వాల్, మాసాబ్ ట్యాంక్, మెహదీపట్నం, హైదర్ గూడ, ప్యాట్నీ, హిమాయ త్నగర్, ప్యారడైజ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సరూర్నగర్లో 5.9సెం.మీ వర్షపాతం నమోదైంది. హస్తినాపురంలో 5.4, అల్కాపురిలో 4.6, నాగోల్లో 4.3, బండ్లగూడలో 4 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశముందన్నారు.