Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పార్కు స్థలాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం నాగారం మున్సి పాలిటీ రాంపల్లి గ్రామ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి కాలనీ పార్కుస్థలంలో చైర్మన్, వైస్ చైర్మన్ బండారి మల్లేష్, కమిషనర్ వాణిరెడ్డి, కౌన్సిలర్ గోక కళావతి యాదగిరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ పార్కు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు మున్సి పల్ పాలకవర్గం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వరకాల పెంటయ్య, మచ్చ శ్రీనివాస్, గండి అంజయ్య, జమ్మల శ్రీనివాస్, బెజగం నవీన్, మీసాల ఎల్లమయ్య, కాలనీ అధ్యక్షులు మహేందర్ గౌడ్, బందెల పరమేష్, పాపారావు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.