Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి సభ్యులు దయానంద్
నవతెలంగాణ-కల్చరల్
అణగారిన ప్రజల వేదన, దళిత ప్రజల వ్యధల ప్రతీక జాషువా కవితలు అని శాసనమండలి సభ్యుడు దయానంద్ అన్నారు. మంగళవారం శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగంగా గుర్రం జాషువా జయంతి సమావేశం జరిగింది. దయానంద్ పాల్గొని మాట్లాడుతూ వివక్ష, మానసిక హింసలను తట్టుకొని గొప్ప సాహితీమూర్తిగా జాషువా నిలిచారని, ఆయన జీవితం మానవీయ విలువల ప్రాముఖ్యత తెలుపుతుందని వివరించారు. ప్రముఖ సాహితీవేత్త రమణ వెలమ కన్ని మాట్లాడుతూ జాషువా రచించిన గబ్బిలం కావ్యంలో దళితుల వ్యధను ఆవేదనా భరితంగా పద్య రూపంలో చెప్పారని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి అధ్యక్షత వహించిన వేదికపై సినీ నిర్మాత రామ సత్యనారాయణ, సంఘ సేవకుడు పీఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.