Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ధర్నాలో నగర కార్యదర్శి ఎం.వెంకటేష్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుపరిధిలోని అర్బన్ ఫారెస్టు కార్మికులకు జీఓ నెం. 60 ప్రకారం రూ.15,600 వేతనం ఇవ్వాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 30 ఏండ్లుగా కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా హెచ్ఎండీఏ అధికారులు దోచుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు ఉద్యోగుల జీఓ నెం.60ను అర్బన్ ఫారెస్టు కార్మికులకు అమలు చేయడంలో హెచ్ఎండీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్మికులవి గొంతెమ్మ కొర్కెలు కాదని, ప్రభుత్వం జారీచేసిన జీఓను అమలు చేయాలని కోరుతున్నారని, హెచ్ఎండీఏ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీపీపీ అర్బన్ ఫారెస్టు వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) గౌరవాధ్యక్షులు జె.కుమారస్వామి, అధ్యక్షులు ఆర్.వాణి, ప్రధాన కార్యదర్శి ఉమ, యూనియన్ నాయకులు సుధాకర్, హరిశంకర్, ప్రమీల, భాగ్యమ్మ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.