Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఓక్కరు గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి (ప్రతి మనిషి ఆరోగ్యాన్ని కాపాడే గుండె ఆరోగ్యాన్ని (ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్, సికింద్రాబాద్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ శ్రీధర్ కస్తూరి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న వరల్డ్ హార్ట్ డేను ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపు కోవాలని ప్రకటించడంతోపాటు ఈ సంవత్సరం మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనే థీంను ప్రకటించిందని తెలిపారు. ఈ సందర్భంగా మన గుండెకు మనం థ్యాంక్స్ చెప్పుకోవడం ఎంతో అవసరం. గుండె మన శరీర భాగాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన అవయవం. మనం నిద్రిస్తున్నా, ఏ పనిచేస్తున్నా గుండె పనిచేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గుండె తన పని తాను సక్రమంగా నెరవేరుస్తున్నంత వరకే మనం ఎలాంటి సక్సెస్ గాని, పనైనా చేయగలుగుతాం. గుండె బాగుంటేనే మనం జీవించగలుగుతాం. గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె అలసిపోతే మన శరీరం కూడా అలసిపోతుంది. గుండె సరైన మోతాదులో రక్తం సరఫరా చేయకపోతే త్వరగా అలసిపోవడం, కాళ్లవాపు రావడం, మెడ నరాలు ఉబ్బడం, రాత్రి నిద్రలో దమ్మువచ్చి లేవడం, హార్ట్ ఫెయిల్యూర్లకు వెళ్లే అవకాశముంటుంది. మరి కొందరిలో గుండె దడ, కళ్లు తిరగడం, ఛాతి నొప్పి రావడం ఇవన్నీ లక్షణాలు గుండె అలసిపోకుండా గుండె ెపై భారం పడకుండా చేసుకోవడం ఎంతో అవసరం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి ఆహారం అవసరం. మన శీరం డస్ట్‌బిన్ కాదు, కాబట్టి బ్యాలెన్స్ డైట్, మంచి కూరగాయ లు, జెంగ్ ఫుడ్ తీసుకో కుండా అనారోగ్యకర మైన ఆహారానికి దూరం గా ఉంటూ శరీరానికి అవసరమైనంత ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి. ఆహారం తగ్గించడంతోపాటు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం కూడా అవసరం. వీటితో పాటు శరీరానికి శారీరక శ్రమ అవసరం. శారీరక శ్రమలో రెండు రకాలు మెంటల్, శారీరక వ్యాయామం రెండురకాలు. మెంటల్లీ ఎక్సర్సైజ్ అంటే మంచి ఆలోచనలు, ఇతరులపై ఆసూయ, ద్వేేషం పెట్టుకోకుండా ఉండ టం. అందరితో కలిసిమెలసి ఉండటం వల్ల శరీరంలో ఒత్తిడి లేకుండా ఆరోగ్యం బాగుంటుంది. రెండవది శారీరక వ్యాయామం. ప్రతి రోజు వ్యాయామం 80 నిమిషాలు ఉండే విధంగా చూసుకోవాలి. శారీరక శ్రమ వల్ల గుండె పంపింగ్ శాతం సాఫీగా సాగుతుంది, వివిధ అవయవాలకు రక్తం సాఫీగా సాగుతుంది, అధిక బరువు రాకుండా చూసుకోవడం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తరచూ చెక్ చేసుకుంటూ ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం తో పాటు పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లల్లో రక్తనాళాలు చచ్చుపడిపోకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనిషి జీవిత కాలం పెరగడంతో పాటు జీవితాన్ని సాఫీగా సాగించేందుకు అవకాశముం టుంది. శరీర ఆరోగ్యం బాగాలేకుంటే ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఎంత సంపాదించినా ఉపయోగం లేదన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన ఆరోగ్యానికి గుండె అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి గుండె ఆరోగ్యం గురించి మనం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరమని డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు.
- డాక్టర్ శ్రీధర్ కస్తూరి
కొవిడ్ సిండ్రోమ్ ప్రభావం.. గుండె సంరక్షణా చర్యలు
కొవిడ్-19 మహమ్మారి ప్రాబల్యం ప్రస్తుతం తగ్గినప్పటికీ హాని కలిగించే వ్యక్తులపై దాని ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. కొంతమంది రోగులు 4 వారాలు దాటిన కూడా ఒకటి లేదా ఇతర లక్షణాలను కలిగి ఉంటున్నారు. కొన్ని లక్షణాలు 12 వారాల తర్వాత మళ్లీ కనిపిస్తున్నాయి. 4 వారాలకు మించిన అటువంటి లక్షణాలు, ఇతర వ్యాధి ప్రక్రియల ద్వారా వ్యాపించనపుడు, లాంగ్-కొవిడ్ సిండ్రోమ్, క్రానిక్ కొవిడ్, పోస్ట్-కొవిడ్ సిండ్రోమ్, పోస్ట్-అక్యూట్ కొవిడ్ సీక్వెలే అని మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ సిండ్రోమ్ లక్షణాలు అస్పష్టంగా ఉండవచ్చు లేదా! ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యవస్థలను సూచించవచ్చు. గుండె సంబంధిత లక్షణాలు గుండె దెబ్బతిన్న సంకేతాలు ఉన్నవారు కొవిడ్-హార్డ్ సిండ్రోమ్‌తో బాధపడు తున్నట్లు అంచనా వేయవచ్చు. స్థూలకాయులు, స్త్రీలు, అంతకు ముందు గుండె సంబంధిత వ్యాధి ఉన్నవారు లేదా కొవిడ్ ఇన్ఫెక్షన్ సమయంలో తీవ్రమైన కార్డియాక్ ప్రభావం ఉన్న వారిలో ఇటువంటివి సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ప్రాణాలతో బయటపడినవారు లక్షణ రహితంగా ఉన్నారు. కానీ పరీక్షించినపుడు, ఎలివేటెడ్ ట్రోపోనిన్ మరియు ఎంఆర్డీ అసాధారణతలు నిరంతర గుండె నష్టాన్ని సూచిస్తున్నాయి. ఈ పరిశీలనల యొక్క ప్రాముఖ్యత ఇప్పటికీ స్పష్టంగా లేదు. తీవ్రమైన ఎపిసోడ్ నుండి కోలుకున్న మొదటి 3 నెలల్లో తీవ్రమైన హృదయ వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఎటువంటి లక్షణాలు లేదా తేలికపాటి లక్షణాలు లేని వారు ప్రారంభంలో 2 నుండి 3 వారాలలో నెమ్మదిగా నడవవచ్చు. వ్యాక్సినేషన్ సిఫార్సు షెడ్యూల్‌ను పూర్తిచేయడం లాంగ్-కొవిడ్ సిండ్రోమ్‌ను నివారించడానికి నిరూపితమైన పద్ధతి. సరైన ఆహారం, విశ్రాంతి, బరువును నియంత్రించడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, రక్తపోటు, మధుమేహం, హైపర్లిపిడోమియాపై తగిన నియంత్రణ వంటి గుండె ఆరోగ్యకరమైన కార్యకలాపాలు గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
లాంగ్ కొవిడ్ సిండ్రోమ్ లక్షణాలు
- జనరల్ అలసట, బద్దకం, అభిజ్ఞ ఆటంకాలు, రుచి వాసన కోల్పోవడం, ఆందోళన, నిద్ర లేకపోవడం
- రెస్పిరేటరీ...నిమిషాల పాటులో పరీక్ష శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి, జ్వరం, హెమోసిస్, అసాధారణ స్థాయిలో ఉండటం.
- కార్టియార్..అసాధారణమైన ప్రోటోనిన్లతో లక్షణంలేనిది, అసాధారణ కార్డియార్ ఎంఆర్ ఫలితాలతో లక్షణం లేనిది, ఛాతి నొప్పి (20 బతికే అవకాశం), గుండెదడ (10 బతికే అవకాశం), ఊపిరి ఆడకపోవడం, సరిలేని సైనస్, టాచి కార్డియా, తిమ్మిరి, అరిత్మియా, గుండె వైఫల్యం, ఒత్తిడి కార్డియోమోనోటీస్ లక్షణాలు.
- గ్యాస్ట్రిక్ ఇంటెస్టినల్ అండ్ హెపాటిక్ న్యూరోలజీ, రుచి కోల్పోవడం వికారం, వాంతులు, దీర్ఘకాలిక అతిసారం, కడుపు నొప్పి, మలబద్ధకం, హైపటైటిస్ అలసట, తలనొప్పి, నిద్ర ఆటంకాలు, మైకం, ఆర్థోస్టాటిక్ అసహనం, మూర్ఛ, స్ట్రోక్, గులియన్ వారె సిండ్రోమ్, పరధీయ నరాల వ్యాధి, ఎన్సెఫలోపతి, అభిజ్ఞా
ఆటంకాలు.
- జెసిడి యొక్క పురోగతి, కొత్త ఎకేఐ, కొత్త గ్లోమెరులర్ వ్యాధి, అధిక రక్తపోటును వేగవంతం చేస్తుంది.
డాక్టర్. ఎ.ఎన్. పట్నాయక్
ఇంటర్నేషనల్ కార్డియాలజీ విభాగం వైద్య నిపుణులు,
స్టార్ హాస్పిటల్, బంజారాహిల్స్
ఫోన్: 040-4477 7700