Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో సర్దార్ భగత్‌సింగ్ 115వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఆశయాలు నేటి కర్తవ్యం అనే అంశంపై సెమినార్ కమలానగర్ ఆఫీస్ హాల్లో జరిగింది. సెమినార్‌కు ముందుగా సర్దార్ భగత్ సింగ్ చిత్రప టానికి, గుర్రం జాషువా జయంతి కావున సర్దార్ భగత్ సింగ్, గుర్రం జాషువా చిత్రపటాలకు వెంకటసుబ్బయ్య, శ్రీమన్నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత సబికులందరూ పూలను అర్పించి వందనం చేశారు. సెమినార్ ప్రారంభం గొడుగు యాదగిరిరావు ఆహ్వానితులను వేదిక మీదికి ఆహ్వానించారు. ఈసీఐఎల్ రిటైర్డ్ ఏజీఎం వెంకటసుబ్బయ్య అధ్యక్షత వహించారు. అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ సర్దార్ భగత్ సింగ్ దేశంలో గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అనీ, ఆయన స్ఫూర్తి నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. గుర్రం జాషువా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం కలం పట్టి పోరాడారని చెప్పారు. ప్రముఖ సంఘ సేవకులు, స్ఫూర్తి గ్రూప్ సభ్యులు ఎస్ఏ రహీం మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి భగత్ సింగ్ తీసుకున్న మార్గం ప్రజల్ని ఎంతో ఉత్తేజపరిచిందన్నారు. చిన్నతనం నుంచి భవిష్య త్తు తీర్చిదిద్దాలని తత్వం కలిగి ఉన్నారని చెప్పారు. చిన్నతనంలో చెట్లు నాటి భవిష్యత్తులో వాటి కర్రలతో తెల్లవారిని తరిమికొట్టవచ్చునని గొప్పగా చెప్పారన్నారు. అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ దేశమంతా తిరిగి విప్లవకారులను సమీకరించారని చెప్పారు. బ్రిటీష్ పాలకులు అరెస్టు చేసి నిర్బంధించారనీ, అప్పటికీ అనేక విషయాలు అధ్యయనం చేసి సమాజ మార్పు కోసం తన జీవితం అంకితం చేయాలని భావించారని చెప్పారు. నిజమైన దేశభక్తులలో సర్దార్ భగత్ సింగ్ ప్రధముడు అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్ మాట్లాడుతూ యువ జనలకు దశ, దిశా నిర్దేశించగలిగే గొప్ప వ్యక్తి సర్దార్ భగత్ సింగ్ అని చెప్పారు. దేశంలో అనేక రుగ్మతలకు కారణం మతతత్వం పోకడలనీ, వాటికి వ్యతిరేకంగా ఆనా డే గుర్తించి తాను నాస్తికుని ఎలా అయ్యాను అని గర్వంగా చెప్పారన్నారు. నేడు యువజనులు సోషల్ మీడియాలో అతుక్కుపోతున్నారని అయినప్పటికీ వారిని సైతం మార్పు చేయటానికి భగత్ సింగ్ ఆశయాలను వారికి తెలియజేయాలన్నారు. మతవాదులు నేడు సోషల్ మీడి యాను విస్తతంగా ఉపయోగించుకుని తప్పుడు సూత్రీకర ణలు, విద్వేష భావాలను ప్రచారం చేస్తున్నారనీ, వాటిని తిప్పి కొట్టాలని చెప్పారు. సమాజం నేడు చాలా స్పీడ్‌లో ఉందనీ, అంతే స్పీడులో భగత్ సింగ్ స్ఫూర్తి తోటి మార్పు లు కూడా తీసుకొస్తుందని చెప్పారు. భారత ప్రజాతంత్ర యువజన సంఘం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కిరణ్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రావటానికి సర్దార్ భగత్‌సింగ్ లాంటి మహాను భావుల చరిత్ర తెలి యజేయాలనీ, అలాంటి కార్యక్రమాలు ప్రజల మధ్య తీసు కురావాలని చెప్పారు. భవిష్యత్తులో యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు నడుస్తామని చెప్పారు. అనంతరం ప్రపంచ సమాచార హక్కుల దినోత్సవం కూడా ఉండటం ఆ రంగ ంలో పనిచేస్తున్న తాడూరి గగన్ కుమార్ కృషిని సభలోని సభ్యులు అభినందించారు. తాడూరు గగన్ కుమార్ మాట్లాడుతూ సమాచార చట్ట హక్కుని సద్వినియోగం చేసుకుంటూ అవినీతిపై పోరాడు తున్నాననీ, భవిష్యత్తు లో కూడా దాన్ని కొనసాగిస్తానని చెప్పారు. సేవారంగం లో మహిళల కృషి చేస్తున్న అవార్డు గ్రహీత పాషను శ్రీమ న్నారాయణ, చేనేత వస్త్రాలతో ఆత్మీయ సత్కారం చేశారు. ప్రసంగించిన రహీం, పి బి చారి, విజరు కుమార్‌కి గగన్ కుమార్, లక్ష్మణ్ కిరణ్‌ని కోమటి రవి, అధ్యక్షుడు వహిం చిన వెంకటసుబ్బయ్యని గొడుగు యాదగిరి రావు ఆత్మీ య సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్, ఆర్ఎ స్ఆర్ ప్రసాద్, నాగయ్య , గోపి, ప్రహల్లాద్, ఉండాలి, ప్రసాద్ బాబు, ప్రభాకర్, ఎం.భాస్కర్ రావు పాల్గొన్నారు.