Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షహీద్ భగత్ పోరాట స్ఫూర్తితో దేశంలో పెచ్చరిల్లుతున్న మతోన్మాదాన్ని తరిమి కొట్టాలని పలువురు నాయకులు అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమరయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ, విప్లవ ధ్రువతార భగత్‌సింగ్ 115వ జయంతిని బుధవారం నగర వ్యాప్తంగా ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు ఘనంగా నిర్వహించాయి. 23 ఏండ్ల తృణప్రాయంలో దేశంకోసం ఉరికంబం ఎక్కిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాల బాటలో నడవాలని, సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ పలు ఇతర సంఘాల ఆధ్వర్యంలో భగత్‌షింగ్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- మతోన్మాదులను ఓడించడమే అసలైన నివాళి
నవతెలంగాణ-బాలానగర్/దుండిగల్/కుత్బుల్లాపూర్
మతోన్మాదులను ఓడించడమే షహీద్ భగత్‌సింగ్‌కు అర్పించే అసలైన నివాళి అవుతుందని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత సత్యం శ్రీరంగం అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ 115వ జయంతి సందర్బంగా కూకట్పల్లి నియోజకవర్గం, ఫతేనగర్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఇచ్చిన ఘనత భగత్ సింగ్‌కే దక్కుతుందన్నారు. 12 ఏండ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 23 ఏండ్ల యువ ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించి యువతకు స్ఫూర్తిగా నిలిచి దేశ భక్తిని రగిలించిన సమరయోధుడు, విప్లవ మూర్తి భగత్ సింగ్ అన్నారు. ఆయన మరణం భారత స్వాతంత్య్రోద్యమ కొనసాగింపునకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపిందన్నారు. నేటి యువత భగత్‌సింగ్ నుండి ఎంతో స్పూర్తిని పొందుతోందన్నారు. చంటి సింగ్, జీత్ సింగ్, ఇందర్ సింగ్, బల్ భీర్ సింగ్, బుద్దు సింగ్, ముఖేంధర్, హేమంత్, శేఖర్ గజానంద్, భరత్ మరియు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.
ప్రగతినగర్‌లో..
స్వాతంత్య్రపోరాట యోధుడు, బ్రిటీష్‌వారిని ఎదురించి పోరాడిన వీరుడు భగత్ సింగ్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షలు పి. సత్యం అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతి నగర్లో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పి.సత్యం మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా పోరాడి అమరుడైన భగత్‌సింగ్ నేటి యువతకు ఆదర్శం అన్నారు. భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బ్యాగారీ వెంకటేష్, రాథోడ్ సంతోష్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పూడూరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్, ప్రగతి నగర్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విప్లవ్, ఎస్ఎఫ్ఐ కూకట్పల్లి మండల అధ్యక్షుడు సుమంత్, నాయకులు అజయ్, విజయ్, రమ్య, వరలక్ష్మి, సౌమ్య, ఐశ్వర్య, మౌనిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
యువతలో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కాంక్ష రగిలించిన విప్లవి వీరుడు షహీద్ భగత్‌సింగ్ అని సీపీఐ(ఎం) బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ అన్నారు. దేశ ప్రజల విముక్తి కోసం 23 ఏండ్ల ప్రాయంలోనే దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసే లక్ష్యంకోసం ఉరికంబం ఎక్కి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రాణాలు అర్పించిన భగత్‌సింగ్ నేటి యువతకు స్ఫూర్తి అన్నారు. బాలానగర్ శోభనా బస్టాప్‌లోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయి, ఇందర్ సింగ్, సందీప్ సింగ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
షాపూర్‌నగర్‌లో...
డీవైఎఫ్ఐ కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ భగత్‌సింగ్ జయంతిని షాపూర్‌నగర్ కార్యాలయంలో నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. పాషా , జిల్లా కమిటీ సభ్యులు ఆది, నాగరాజు, కరుణాకర్, నాయకులు వంశీ, శంకర్, స్వాతి పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.