Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2న లంగర్ హౌజ్‌లోని బాపూఘాట్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత అధికారులను ఆదేశించారు. బుధవారం గాంధీ జయంతి ఏర్పాట్లపై టూరిజం, రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యా, సమాచార, జలమండలి, ఆర్అండ్బీ, హార్టికల్చర్, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌ను సందర్శించేందుకు ప్రముఖులు విచ్చేయుచున్నారని తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్డీవో వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.