Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనం గా నిర్వహించినారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్కిడి అనిల్ రెడ్డి భగత్ సింగ్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్కిడి అనిల్ రెడ్డి, ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు నంద్యాల కార్తీక్ రెడ్డి మరియు నాయకులు మహేష్, గణేష్, సాయి, వేణు, లింగస్వామి, పవన్ పాల్గొన్నారు.
భగత్‌సింగ్ చేసిన త్యాగం మరువలేనిది
కూకట్‌పల్లిలో...
కూకట్పల్లి బస్టాండ్ వద్ద గల భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలవేసి స్థానిక కార్పొ రేటర్ జూపల్లి సత్యనారాయణ నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్ మరియు ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మరియు యాదగిరి, రాము, రాజు, ప్రవీణ్, నర్సింగ్ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో...
స్వతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు భగత్ సింగ్ 110 జయంతి వేడుకలు ఏఐఎస్ఎఫ్ మండల సమితి ప్రధాన కార్యదర్శి చింత వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం రావినారాయణరెడ్డి కాలనీలో ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాది రెడ్డి, మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్‌లు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హరి సింగ్ నాయక్, మండల అధ్యక్షులు విసంపల్లి మహేందర్, జోష్ణ, బన్నీ, కార్తీక్ పాల్గొన్నారు.
సరూర్‌నగర్‌లో...
భగత్ సింగ్ జయంతి సంద ర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు జయంతి వేడుక లకు చిలుక ఉపేందర్ రెడ్డి హాజరై ఆ విప్లవ వీరుడి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్, బొడ్డుపల్లి మహేందర్, మామిడి రామకష్ణ గౌడ్, రాజు నాయక్, కళ్యాణ్, ప్రేమ్ నాయక్, జహంగీర్, భాస్కర్, శ్రీకాంత్, అంజి, మల్లేశ్, సాయి జగదీష్, అంజి, విజరు, శేఖర్, రమేష్, భాను, కుమార్, శివ, నగేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉప్పల్‌లో..
భగత్‌సింగ్ జయంతి ఉత్స వాలు సీఐటీయూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉప్పల్ సీఐటీ యూ ఆలయంలో భగత్‌సింగ్ 115వ జయంతి పురస్కరిం చుకొని. భగత్‌సింగ్‌కి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు సిఐటియు నాయకులు గణేష్, నరేందర్ రెడ్డి, రవి, గౌరీ శంకర్, సురేందర్, నాగిరెడ్డి, షఫ ీతదితరులు పాల్గొన్నారు.