Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ విచారణ కు పిలిచినంత మాత్రాన ఎమ్మెల్యే దోషి కాదు
- సోనియా గాంధీని, రాహుల్ గాంధీని
- ఈడీ విచారించింది
- డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య.
నవతెలంగాన-తుర్కయాంజల్
దేశంలో అత్యధిక కుంభకోణాలుచేసింది కాంగ్రెస్ పార్టీ అని, క్రమశిక్షణ కు మారుపేరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పై బురద చల్లడానికి ప్రయత్నిస్తే ఆకాశం పై ఉమ్మి ఊసినట్లేనని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఎద్దేవా చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటి టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మన్నెగూడ లోని జెఎమ్ఆర్ ఫంక్షన్ హల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సేవలో నిమగమైన ఎమ్మెల్యే పై బురద జల్లడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈడీ విచారణకు పిలిచినంత మాత్రాన ఎమ్మెల్యే దోషి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకు రాలు సోనియాను, వారి కుమారుడు రాహుల్ గాంధీని, అల్లుడు రాబర్ట్ వదేరాలను కూడా ఈడీ విచారించిందని గుర్తుచేశారు. నిజానిజాలను పంచభూతాలు, కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. నిజా నిజాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అవాకులు చేవాకులు పేలితే నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిత్యం క్యాంపు ఆఫీసులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ప్రజల ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బిజేపీ పార్టీలు నిరాదరణమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శిం చారు. ఈడీ విచారణలో ఎమ్మెల్యే కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, తుర్కయాంజల్ మున్సిపాలిటీ టీఆరెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, తుర్కయాంజల్ సహకార బ్యాంకు డైరెక్టర్ సామ సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కందాడ ముత్యం రెడ్డి, మున్సిపాలిటీ టీఆరెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు అశ్విని, టీఆరెస్ పార్టీ మున్సిపాలిటీ కార్యదర్శి వెంకటేష్, నాయకులు పుల్లగుర్రం విజయానంద రెడ్డి, తాళ్లపల్లి మోహన్ గుప్త, గుండా ధనరాజ్, రొక్కం ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.