Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తహాసీల్దార్ అనితా రెడ్డి తమ సిబ్బందితో కలిసి పోలీ సుల బందోబస్తు మద్య బుధవారం కూల్చివేతలు చేపట్టారు. అబ్దుల్లా పూర్మెట్ మండలం, తట్టిఖాన రెవెన్యూ సర్వేనెం. 26లోని ప్రభుత్వ భూమిలో కొంతమంది భూ అక్రమాలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. భూ అక్రమదారులపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ అనితా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిిర్యాదు స్వీకరించిన పోలీసులు అక్రమ దారులపై కేసు నమోదు చేశారు.అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.