Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానం, చేనేత కార్మికుల కష్టంతో మహిళలకు బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేయటం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్ లో మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. మేయర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రాముఖ్యత కలిగిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న చీరలు నాణ్యతతో కుడినవి ఇస్తే ఆడపడుచులు సంతోషిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ జ్యోతి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.