Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుందరీకరణ, ఇతర అభివృద్ధి నిర్మాణ పనులకు ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ నగర్లో రూ. 1.20 కోట్ల అంచనా వ్యయంతో, శంశిగూడలో కోటి రూపాయలతో చేపట్టే శ్మశాన వాటిక సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కాజానగర్, ఎన్టీఆర్నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 2, ధరణి నగర్, పంచమి కానీలలో రూ. 80 లక్షల 10 వేలతో నూతనం చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే హెచ్ ఎంటీ శాతవాహన నగర్, సాయిచరణ్ కాలనీల్లో రూ. 70 లక్షల 6 వేలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.