Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
సుచిత్ర జంక్షన్ నుండి కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వరకు చేపడుతున్న సి.ఆర్.ఎం.పి. (కంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం) రోడ్డు వెడల్పు పనుల్లో ఏకపక్ష ధోరణి కనిపిస్తోందని, ఇది తగదని యువనేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేపీ విశాల్గౌడ్ అన్నారు. జయరాం నగర్, విమనపురి కాలనీ, అయోధ్యనగర్ కాలనీ వాసులు రోడ్డువెడల్పువల్ల ఇబ్బందులపై కేపీ విశాల్గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇరువైపులా సమాంతరం పాటించకుండా ఒకే వైపు ఎక్కువ శాతం రోడ్డును ఆక్రమించి రోడ్డు పనులను చేపడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన విశాల్గౌడ్ జనులు జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులతో చర్చించారు. రోడ్డు పనుల్లో ఒకవైపు ఎక్కువ, మరోవైపు తక్కువ కాకుండా సమాంతరం పాటించాలని సూచించారు. స్థానికులు కుత్బుల్లాపూర్ డీసీ మంగతాయారుకు, ఎస్సీ చెన్నారెడ్డికి, ఈఈ కృష్ణ చైతన్యకు బస్తీవాసులు వినతి పత్రాలు అందజేశారు.