Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మృతుల కుటుంబ సభ్యులను పరార్శించిన
కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నరసింహరెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ జిల్లా చీర్యాల గ్రామంలోని నాట్ఖాన్ చెరువులో ఈతకని వెళ్లి గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో మరో ఇద్దరు మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. ఈతకోసం వెళ్లిన ముగ్గురిలో బుధవారం చేపట్టిన గాలింపులో మృతి చెందిన ఒకరిని ఒడ్డుకు చేర్చగా మరో ఇద్దరి మృతదేహాలను కీసర పోలీసులు, గజ ఈతగాళ్లు గురువారం బయటకు తెచ్చారు. బుధవారం విద్యార్థులు చీర్యాల గ్రామంలోని నాట్ఖాన్ చెరువులో ఈతకోసం అని వెళ్లారు. వెళ్లినవారిలో ఉబేద్ (18), హరిహరన్(18), బాలాజీ (18) చెరువులోకి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మునిగిపోయిన సంగతి తెలిసిందే. బాలాజీ మృతదేహం బుధవారమే బయటకు తీయగా ఉబేద్, హరిహరన్ మృతదేహాల కోసం ఆరోజు రాత్రి వరకు గాలించినా ఫలితంలేక పోయింది. గురువారం ఉదయం నుండి ముమ్మరంగా మళ్లీ గాలింపు చేపట్టారు. మిగతా ఇద్దరి మృతదేహాలను కూడా బయటకు తెచ్చారు. పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కీసర సీఐ రఘువీర్ రెడ్డి తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
మృతుల కుటుంబ సభ్యులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ విస్తా వెంకటేష్‌లతో కలిసి పరామర్శించారు. కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరా, చీరాల సర్పంచ్ ధర్మేందర్, ఉపసర్పంచ్ తిరుమల్ రెడ్డి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.