Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి వినతి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీలో మంచినీటి సమస్య తీర్చేందుకుగాను వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం మేడ్చల్‌జిల్లా కలెక్టర్ హరీశ్‌కు వినతిపత్రం అందజేశారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 206/2 లో గతంలో గిరిజన సంక్షేమ హాస్టల్‌కు కేటాయించిన 0.20 గుంటల భూమిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 0.07 గుంటల స్థలాన్ని వాటర్ ట్యాంకు నిర్మాణం కోసం కేటాయించాలని పేర్కొన్నారు. అలాగే నాగారం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి జిల్లా పరిషత్ హైస్కూల్లోని స్టోర్ రూమ్ వద్ద 10 ఫీట్ల స్థలం కేటాయించాలని కోరారు.