Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మెట్రో సువర్ణ ఆఫర్లో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన మంత్లీ లక్కీ డ్రా విజేతలను గురువారం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రకటించింది. అమీర్పేట స్టేషన్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో అయిదుగురు విజేతలకు హైదరాబాద్ మెట్రో రైల్, షుగర్బాక్స్ భాగస్వామ్యంతో బహుమతులు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఎ.కె.గుప్తా, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ సీఎండీ కెవీబీ రెడ్డి, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ సీవోవో సుధీర్ చిప్లుంకర్, సీఎస్వో మురళి వరదరాజన్ పాల్గొన్నారు. వీరిలో మొదటి బహుమతిని కె.సాహిత్య అందుకోగా, ద్వితీయ బహుమతిని ప్రాబీర్ కుమార్ బారిక్, మూడవ బహుమతిని రత్లావత్ రజిత, నాల్గవ బహుమతిని డి.బాలదేవ్, అయిదవ బహుమతిని నాంపల్లి యుగంధర్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ సీఎండీ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ మంత్లీ లక్కీ డ్రా విజేతలు అందరికీ అభినందనలు తెలిపారు. మెట్రో ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, సురక్షిత ప్రయాణం అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. తమ నాలుగేండ్ల అనుబంధం గురించి షుగర్ బాక్స్ నెట్వర్క్స్ కో-ఫౌండర్, సీఈవో రోహిత్ పరాంజపై మాట్లాడుతూ వినియోగదారులను అర్ధం చేసుకోవడం, సేవా నాణ్యతపరంగా అత్యున్నత ప్రమాణాలను నిర్ధేశించడంలో ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ ఓ మార్గదర్శిగా ఉందని తెలిపారు.