Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులతో డిప్యూటీ స్పీకర్ పద్మారావు చర్చలు
- స్థలాలు ఇచ్చేందుకు సుముఖత
నవతెలంగాణ-ఓయూ
సీతాఫల్మండి-మాణికేశ్వరీ నగర్ల మధ్య రాకపోకలకు వీలుగా మాణికేశ్వరీ నగర్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి మార్గం సుగమమైందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వంతెన, అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో స్థలాలు కోల్పోయే వారికి న్యాయం చేకూరుస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. గురువారం సీతాఫల్మండీలోని తన కార్యాలయంలో బాధితుల, అధికారులతో కలిసి చర్చలు జరిపారు. ఆర్యూబీ నిర్మాణానికి తమ స్థలాలను కేటాయించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని పద్మారావు గౌడ్ తెలిపారు. బాధితులకు తగిన న్యాయం చేకూర్చాలని చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డికి సూచించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి ముంతాజ్, అధికారులు, యమున, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.