Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. గురువారం తార్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌ను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దాలని, అధికారులు ప్రత్యేక చొరవతీసుకొని ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు ఎల్లవేళలా సహకరిస్తుందన్నారు. అలాగే జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థలు కలిసి పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దశరథ్, రాంకీ సికింద్రాబాద్ జోనల్ ఇన్చార్జ్ గోవర్ధన్ రెడ్డి, ఏఎంహెచ్ఓ రవీందర్ గౌడ్, ఎస్ఎస్ ధన గౌడ్, శానిటేషన్ సిబ్బంది, రాంకీ సంస్థ అధికారులు పాల్గొన్నారు.