Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
నగరంలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో బేగంబజార్ డివిజన్లోని గౌలివాడ బస్తీవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, క్వార్టర్స్ శిథిలం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని 90 కుటుంబాలు భయాందోళనలతో ఉన్నాయని స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్, బీజేపీ వార్డ్ కమిటీ సభ్యులు జె. శంకర్ నాంపల్లి తహసీల్దార్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మార్వో గురువారం గౌలివాడలో పర్యటించారు. గుడిసెవాసుల పరిస్థితి, క్వార్టర్స్ అధ్వాన స్థితిని పర్యవేక్షించారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండకూడదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక బస్తీవాసులు సమ్మక్క, రాధ, పద్మ, లక్ష్మి, జ్యోతి, సరోజ, ఆర్తి, వెంకటమ్మ, కళావతి తదితరులు పాల్గొన్నారు.