Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగంగా చరిత్ర ప్రసిద్ధుల జయంతి ఉత్సవాలు నిర్వహించడం అపురూపం అని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ ప్రశంసించారు. పరుల్లో ప్రతిభను గుర్తించి వారిని గౌరవించటం ఉత్తమ సంస్కరమని ఆయన అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదికపై అభినందన ప్రముఖ సాంస్కృతిక సంస్థ నిర్వహణలో సాంస్కృతిక, కళా సంస్థల ప్రతినిధులకు ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం జరిగింది. డాక్టర్ రమణ పాల్గొని గానసభ అధ్యక్షుడు కళా జనార్దన ముర్తి, కిన్నెర రఘురాం, జీ. వీఆర్ ఆరాధన వెంకట రెడ్జి, ఆకృతి సంస్థ సుధాకర్ లను సత్కరించారు. సాంస్కృతిక పరిమళాన్ని సమాజానికి అందించేవారు సాంస్కృతిక, కళా సంస్థ లేనని అన్నారు. అధ్యక్షత వహించిన ప్రముఖ కవి డాక్టర్ ఎన్. గోపి మాట్లాడుతూ తెలుగు వారి సాంస్కృతిక చరిత్ర కళా సంస్థలు భాగమని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మించి కళా, ఆహితీ కార్యక్రమాలు సాంస్కృతిక సంస్థలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. స్వాగతం పలికిన అభినందన భవాని సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు పల్లకీ మోసే బోయీలని అభివర్ణించారు. సభలో శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.