Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అథితిగా రాష్ట్ర క్షయ నియంత్రణా ధికారి డాక్టర్ ఏ.రాజేశం హాజరై సిబ్బందితో కలిసి స్టెప్పులు వేసి సిబ్బందిలో ఉత్సాహం రెట్టింపు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పన చారిత్రక బతుకమ్మ పండగ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనద న్నారు. తొమ్మిది రోజుల పాటు పూలను పూజించడం తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.సుమలత, డాక్టర్ దేవినాగేశ్వరి, డాక్టర్ చల్లాదేవి, డాక్టర్ కల్పనా కాంటే, డాక్టర్ హిరమై, వీణ, నీరజ, అనురాధ, అన్నపూర్ణ, లక్మి, జ్యోతి, పూజ, భారతమ్మ, అక్బరీబేగం, జ్ఞనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.