Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
తెలంగాణ ఉద్యమాన్ని ఉవెత్తున నిలిపించి బతుకమ్మ పండుగ అని సీసీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ అన్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్ గిరిప్రసాద్ నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలమల్లేష్ మాట్లాడుతూ ఉద్యమంలో ఊరువా డను ఏకం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది బతుకమ్మ పండుగ అన్నారు. కేంద్రంలోని బీజేపీ సంస్కతి సంప్రదాయలను దెబ్బతీస్తుందన్నారు. మునుగోడులో మతోన్మాద పార్టీని ఓడించి ప్రజలు అభివద్ధికే పట్టం కడుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బతుకమ్మని పేద, ధనిక తేడాలే కుండా ఆందరిని ఐక్యం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రంలో కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు ఫారూక్ బారు, నాయకులు కృష్ణమూర్తి, లక్ష్మి, యాదగిరి, రాజేశ్వరి, శ్యామల, స్వరూప, సహదేవ్, వెంకటాచారి, నర్సింహా, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.