Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ''మినీ వాకథాన్'' ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. గుండె సంరక్షణ, గుండె-ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్స్ నుంచి హైటెక్స్ వరకు USE HEART FOR EVERY HEART అనే నినాదంతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ విచ్చేసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభి ంచారు. ఈ ర్యాలీలో సుమారుగా 300 మందికి పైగా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సేవలు అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇలాంటి అవగాహనా ర్యాలీ, కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైంత వరకు గుండె పై ఒత్తిడి పడకుండా చూసుకోవడం మంచిది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. డాక్టర్ సీనియర్ కార్డియాలజిస్ట్ బాలాజీ మాట్లాడుతూ మనందరికీ గుండెపోటు రావడానికి గల సాధారణ కారణాలు గురించి తెలుసు అనీ, ఒళ్లు నొప్పులు, నీరసం ఆవరించడం, నిద్ర లేమి, ఆందోళన, కోపం, డిప్రెషన్ కలగడం, అసహనం, మతిమరుపు కనబడతాయనీ, ఇవన్నీ ముందుగా గుర్తించి సరైన సమయంలో హాస్పి టల్కి వెళితే మనం ఎలాంటి స్ట్రోక్ బారిన పడకుండా ఉంటాం అన్నారు. గుండె ఆరోగ్యాన్ని సమీక్షించుకోండి అన్నారు. . ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకో వడం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండా ఉండొ చ్చు అన్నారు. గుండె ఆరోగ్యం కోసం కనీసం 30 నుంచి 40 నిమిషాలు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేయాలనీ, దీనివల్ల ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతుందన్నారు. కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధారణంగా మన జీవితాలు ఒత్తిడితో కూడుకున్నవి అనీ, తగినంతగా నిద్ర లేకపోవడం, అనారోగ్య కారణాల వల్ల ఒత్తిడి కనిపిస్తుంటుందన్నా రు. సాధ్యమైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచితే గుండె ప్రశాంతగా ఉంటదనీ, ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు. కార్యక్ర మంలో క్లస్టర్ హెడ్ దుర్గేష్, సెంటర్ హెడ్ మాత ప్రసాద్, డాక్టర్ అనూష, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.