Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్‌తో కలిసి అపోలో హాస్పిటల్స్ రాయదుర్గం మెట్రో స్టేషన్లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు, ఎల్అండ్టీ సిబ్బందికి ఉచిత కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరం ను గురు, శుక్ర వారాల్లో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎల్ అండ్‌టీ మెట్రో హైదరాబాద్ సీఓఓ సుధీర్ చిప్లుంకర్, అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ సీఓఓ తేజేస్వీ రావు, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర బాబు రాయదుర్గం మెట్రో స్టేషన్లో శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత శిబిరంలో భాగంగా నిర్వహించే పరీక్షలలో ర్యాండమ్ బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, బిపి తనిఖీ, ఎత్తు, బరువుల పరీక్షల తరువాత వైద్యులతో కన్సల్టేషన్‌ను నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధుల ఉనికి ఉన్నట్లు గుర్తించిన వారికి ఇసిజి స్క్రీనింగ్‌కు, తదుపరి వ్యాధి నిర్దారణ అవసరమైన వారికి ఎకో స్క్రీనింగ్ నిర్వహించడాన్ని సిఫార్సు చేస్తారు.
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో..
వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్‌తో కలిసి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు, అండ్ ఎల్అండ్టీ సిబ్బందికి ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉచిత కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించింది. ఈ శిబిరాన్ని ఎల్అండ్టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సీఎస్ఒ మురళీ వరదరాజన్, అపోలో స్పెక్ట్రా, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ విజరు అగర్వాల్, అపోలో స్పెక్ట్రా సిఒఒ రూపిందర్ కౌర్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్‌పేట్ సిఇఒ శ్రీనివాస్ రెడ్డి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజరు అగర్వాల్ మాట్లాడుతూ మన ఆరోగ్య పరిస్థితి చాలా కీలకమని తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే మన ఆరోగ్య స్థితిపై తాజా సమాచారం అందుతుందన్నారు. మురళీ వరదరాజన్ మాట్లాడుతూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం, మానసిక ఒత్తిడి, వాయు కాలుష్యం వంటి కారకాల వలన, ప్రపంచంలోని ఈ ప్రాంతంలోని జనాభాలో 75శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారన్నారు.