Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ నుక్కా డానియెల్ నియమితులయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలో కమిషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహెతాబ్ రారు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నుక్కా డానియెల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కృషి చేస్తానన్నారు. తెలంగాణలోని 33 జిల్లాలకు కమిటీలు వేస్తానన్నారు. మానవ హక్కులను కాపాడటంలో, పేద ప్రజలకు సామాజిక న్యాయం అందించడానికి తాను ముందుంటానని ఆయన స్పష్టం చేశారు.