Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
అధిక నూనె వాడకం ద్వారా అనవసర కొవ్వులు శరీరంలోకి చేరి హద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.మనోజ్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం హిమాయత్‌నగర్ డివిజన్లోని ముత్యాలబాగ్ బస్తీ దవాఖానాలో 'గుండె జబ్బు సమస్యలు-గుండెను ఎలా కాపాడుకోవడం' అంశంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యక్తి రోజుకు 20 ఎంఎల్ కంటే ఎక్కువ నూనె వాడకూడదన్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే మన జిల్లాల్లో గుండె జబ్బులు ఎక్కువగా నమోదవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయని గుర్తు చేశారు. 40 ఏండ్లు దాటని యువకులు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారని, పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తుందన్నారు. ప్రధానంగా మధుమేహం (షుగర్)తో బాధపడే వారిలో వెయ్యికి 25 మంది గుండెపోటుతో చనిపోతున్నారని వివరించారు. అల్పాదాయ వర్గాలు అవసరాలు, బాధ్యతలు, కోరికలను తగ్గించుకోవాలని సూచించారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వారంలో ఐదు రోజులైనా వేగవంతమైన నడక, ఈత, షటిల్, స్కిప్పింగ్ లాంటి వ్యాయామాలు అవసరమని చెప్పారు.