Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-సరూర్‌నగర్
విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న ఎస్సీ మహిళలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోందన్నారు. శుక్రవారం సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్‌లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు షీ క్యాబ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి రంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 23 మందికి షీ క్యాబ్స్ వాహనాలను అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక మహిళల భద్రతపై షీ టీమ్‌లను ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. దళిత మహిళలకు 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి షీ క్యాబ్స్ వాహనాలను అందిస్తున్నామనిచ చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్ కుమార్, ప్రవీణ్ కుమార్, కొండల్ రెడ్డి, అంకిరెడ్డి, రాజేష్, మహమ్మద్ సలీం, ఋషి పాల్గొన్నారు.