Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కవులు సమాజంలో జరుగుతున్న దుష్ట పరిణామాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండి తమ రచనలు ద్వారా ప్రజలను జాగరూకుల చేయాలని సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ కోరారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై సాహిత్య అకాడమీ నిర్వహణలో కవయిత్రుల కవితా సమ్మేళనం శుక్రవారం జరిగింది. జూలూరి గౌరి శంకర్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో నేడు పెచ్చరిల్లుతున్న మతోన్మాద శక్తుల నుంచి మహిళలు తల్లి పాత్రలో గద్దల నుంచి కోడి తన పిల్లలను కాపాడుకొన్న విధంగా పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ గడ్డ మహిళ చైతన్య వేదిక అన్నారు. రచయిత్రులు తెలంగాణ సంస్కృతి సమతా, ఐక్యత భావనల వ్యాప్తికి రచనలు చేయాలన్నారు. ఇనాంపూడి శ్రీలక్ష్మీ అధ్యక్షత వహించిన సభలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ స్వాగతం పలికారు. దేవిక దేవి, జూపక సుభద్ర, జ్వలిత, వాణి, నిహారిణి తదితరులు స్వీయ కవితా గానం చేశారు.