Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప సభాపతి పద్మారావు గౌడ్ వెల్లడి
నవతెలంగాణ-సికింద్రాబాద్
సికింద్రాబాద్ పరిధిలో లబ్దిదారుల ఇండ్లకే చేరుకుని ఆసరా పించన్ల కార్డులను అందించే పద్దతిని చేపడుతున్నట్టు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మెట్టుగూడ డివిజన్లో విస్త్రతంగా పర్యటించారు. కార్పొరేటర్ రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, ఎమ్ఆర్ఓ మాధవి, యువ నేతలు కిషోర్ కుమార్, రమేశ్వర్ గౌడ్, అధికారులు, నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరిధిలో అర్హులిన్ వారికి అన్ని ప్రయోజనాలు వర్తించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. తన పర్యటనలో భాగంగా పలు సమస్యలను గుర్తించి అప్పటికప్పుడే వాటి పరిష్కారానికి ఏర్పాట్లు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెట్టుగూడ, అయ్యప్ప టెంపుల్, గోవింద్ పురం, ఆలుగడ్డ బావి, వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటన సాగింది. మేట్టుగుడా పార్క్ ను వెంటనే అభివృద్ధి చేసి, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను తొలగించాలని అయన ఈ సందర్భంగా ఆదేశించారు.