Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ పండగ సంబురాలు అంబుర్న్నాంటాయి. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి బతుకమ్మ ఆడి సందడి చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపారు. బతుకమ్మ పండగలో ఆరో రోజైన శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రంగురం గుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మ లను మధ్యలో ఉంచి పాటలు పాడుతూ బతుకమ్మ సంబు రాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహి ళలు, చిన్నారులు గిరిజన సంప్రదాయ వేషధారణ, డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుకొన్నాయి. కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి ఝాన్సీరాణి, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్ మోహన్రావు, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.