Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
మన సంస్కతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్ర మల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవీ నవరాత్రుల సంద ర్భంగా శుక్రవారం సనత్‌నగర్, అమీర్‌పేట, బేగంపేట, మొండా మార్కెట్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లోని పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలం గాణ పల్లెల్లో పుట్టిన బతుకమ్మ తెలంగాణ సంస్కతికి ప్రతీక అన్నారు. అలాంటి బతుకమ్మ నేడు దేశ విదేశాల్లో ఎంతో ఘనంగా జరుపుతున్నారనీ, ఇది మనకెంతో గర్వ కారణం అన్నారు. 9 రోజుల పాటు మహిళలు బతు కమ్మను నిర్వహిస్తారనీ, ప్రభుత్వం అందుకు అన్ని ఏర్పా ట్లు చేసిందని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, మహంకాళి అమ్మవారి ఆల యాల వద్ద బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిం చనున్నట్టు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా అన్ని పండుగలను ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారని తెలి పారు. సనత్‌నగర్‌లోని హనుమాన్ ఆలయం వద్ద మంత్రి కి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలి కారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన అమ్మవారికి మంత్రి పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిని వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, నాయకులు బాల్ రెడ్డి, సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సరాఫ్ సంతోష్, రాజేష్ ముదిరాజ్, పుష్పలత ఉన్నారు.
అమీర్‌పేట హనుమాన్ ఆలయంలో..
అమీర్‌పేటలోని హనుమాన్ ఆలయంలో అమ్మవా రికి మంత్రి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు హన్మంతరావు, అశోక్ యాదవ్, సంతోష్, వనం శ్రీనివాస్, గోపిలాల్ చౌహాన్, హరిసింగ్ తదితరులు ఉన్నారు.
బేగంపేటలో..
బేగంపేటలోని కట్టమైసమ్మ అమ్మవారు, మయూర్ మార్గ్‌లోని నల్ల పోచమ్మ అమ్మవార్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, నరేందర్ రావు, శ్రీహరి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.